Mopidevi: డిప్యూటీ కమిషనర్ శ్రీరామవరప్రసాదరావుకు ఎమ్మెల్యే సన్మానం
Mopidevi: మోపిదేవి ఆలయానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు దక్కిన సందర్భంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీరామవరప్రసాదరావును ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సత్కరించారు.
Mopidevi: డిప్యూటీ కమిషనర్ శ్రీరామవరప్రసాదరావుకు ఎమ్మెల్యే సన్మానం
మోపిదేవి: మోపిదేవి పుణ్యక్షేత్రం స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకోవటం అభినందనీయం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈఓ దాసరి శ్రీరామవరప్రసాదరావు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కృష్ణాజిల్లా -2026 ఉత్తమ అవార్డు అందుకున్న సందర్భంగా మంగళవారం పెదకళ్లేపల్లి దేవస్థానంలో ఆయనను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
మోపిదేవి దేవస్థానం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో దేవస్థానానికి వస్తున్న వేలాది భక్తులకు స్వచ్ఛమైన వాతావరణం, పరిసరాలు ఏర్పాటు చేస్తూ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనభాగ్యం కలిగించి ప్రభుత్వం ద్వారా అవార్డు అందుకోవటం శుభ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు డిప్యూటీ కమిషనరుకు అభినందనలు తెలిపారు.




