Nandigama: నందిగామలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణ పనుల పరిశీలన
Nandigama: నందిగామ మండలం రాఘవపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయ శాశ్వత భవన నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు.
Nandigama: నందిగామలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణ పనుల పరిశీలన
నందిగామ: నందిగామ నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యావకాశాలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నాడు నందిగామ మండలం రాఘవపురం గ్రామంలో శాశ్వత కేంద్రీయ విశ్వవిద్యాలయ భవనం నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పరిస్థితి ఏమిటి అనే అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని, నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు...
విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యత
కేంద్రీయ విశ్వవిద్యాలయ శాశ్వత భవనం అందుబాటులోకి రావడం వల్ల విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు, ఉన్నత విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు దోహదపడనుంది. ఈ నిర్మాణం పూర్తయితే నందిగామ ప్రాంతానికి విద్యాపరంగా మరింత గుర్తింపు లభించే అవకాశముంది. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఇటువంటి కీలక ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సమన్వయంతో పనులు ముందుకు సాగేలా చూడటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే సౌమ్య క్షేత్రస్థాయి పర్యటన స్పష్టం చేస్తోంది...
అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ
ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సకాలంలో కార్యరూపం దాల్చేలా ఎమ్మెల్యే సౌమ్య గారు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. రాఘవపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయ శాశ్వత భవన నిర్మాణ పనుల పరిశీలన కూడా నియోజకవర్గ అభివృద్ధి, విద్యారంగ ప్రగతిపై ఆమె చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.




