Mopidevi: మోపిదేవిలో నూతన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే!
Mopidevi: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎదుట నూతన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్.
Mopidevi: మోపిదేవిలో నూతన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే!
Mopidevi: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎదుట దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ముఖ్య అతిధిగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి నూతన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. నూతన దుకాణాలలో అధికారులు, నాయకులు, లీజుదారులతో కలిసి పూజలు చేసి దుకాణాలను లీజుదారులకు అప్పగించారు.
కార్యక్రమంలో ఎంపీపీ రావి దుర్గావాణి, జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, బీజేపీ జిల్లా నాయకులు వేములపల్లి శ్రీహరి, మాజీ సీడీసీ చైర్మన్ రావి నాగేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు నడకుదుటి జనార్ధనరావు, జనసేన మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, బీజేపీ మండల అధ్యక్షులు సనకా ప్రశాంత్, తాళ్లూరి హరి హరప్రసాద్, శోభిల ఏడుకొండలు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, తహసీల్దార్లు ఎస్.భవానీ, హరనాధ్, ఎంపీడీఓ స్వర్ణభారతి, ఎంపీటీసీ కొమ్ము పవన్, దేవస్థానం సూపరింటెండెంట్ అచ్యుత మధుసూధనరావు, మాజీ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు, కో-ఆప్షన్ సభ్యులు చందన రంగారావు, సొసైటీ చైర్మన్లు కోసూరు నాగమల్లేశ్వరరావు, బళ్ళ సీతారాంప్రసాద్, కూటమి నాయకులు బాదర్ల లోలాక్షు నాయుడు, మెరకనపల్లి నరేష్, కూరేటి రాఘవ తదితరులు పాల్గొన్నారు.




