Poranki: పోరంకిలో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడే శంకుస్థాపన!
Poranki: తాడిగడప మున్సిపాలిటీ పోరంకిలో రూ.64.3 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్.. మౌలిక వసతుల కల్పనే లక్ష్యం.
Poranki: పోరంకిలో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడే శంకుస్థాపన!
Poranki: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి గ్రామంలో SS SQAR వద్ద ₹64.3 లక్షల సాధారణ నిధులతో పోరంకి చిగురుపాటి విజయలక్ష్మి రోడ్డు & నందనవం అపార్ట్మెంట్ వరకు రోడ్డు నిర్మాణ పనులకు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ...పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు,మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో గత 27 నెలల కాలంలో కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామని,ప్రజల అవసరాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి నాయకత్వంలో,మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో తాడిగడప మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు పేర్కొన్నారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీ లేకుండా పనిచేస్తామని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,అధికారులు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




