Nuzvid: నూజివీడులో జర్నలిస్టులపై దాడి - స్పందించిన మంత్రి కొలుసు పార్థసారధి!

Nuzvid: నూజివీడులో జర్నలిస్టులపై దాడి ఘటనపై స్పందించిన సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఆదేశం.

Ramana, Penamaluru
Published on: 26 Sept 2026 2:09 PM IST
Nuzvid
X

Nuzvid: నూజివీడులో జర్నలిస్టులపై దాడి - స్పందించిన మంత్రి కొలుసు పార్థసారధి!

Nuzvid: నిన్న రాత్రి నూజివీడులో జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ ఘటనపై మంత్రి పార్థసారధి వెంటనే స్పందిస్తూ నూజివీడు డీఎస్పీకి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులను ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి స్పష్టం చేసినట్లు జర్నలిస్టులు తెలిపారు. జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

మంత్రిని కలిసిన వారిలో:

9 Plus AP బ్యూరో చీఫ్ మేడ కృష్ణ, Zee TV బాషా, Citi 24×7 K.B. కిషోర్, I News ప్రదీప్, 10 TV ప్రసాద్, HM TV రమణ, ప్రశాంత్, కుమార్,శేషు తదితరులు ఉన్నారు.

జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru