Kuchipudi: కూచిపూడి పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నాయకుల ధర్నా!

Kuchipudi: కృష్ణా జిల్లా కూచిపూడి పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ ధర్నా. బీజేపీ నాయకుడు పోలన అశోక్ అక్రమ అరెస్టును నిరసిస్తూ నినాదాలు, కేసులు ఎత్తివేయాలని డిమాండ్.

Bhanu, Pamarru
Published on: 29 Sept 2026 12:48 PM IST
Kuchipudi
X

Kuchipudi: కూచిపూడి పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నాయకుల ధర్నా!

Kuchipudi: పామర్రు నియోజకవర్గం,మొవ్వ (మ)కూచిపూడి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి బిజెపి నాయకులు ధర్నా. జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు పోలన అశోక్ అక్రమ అరెస్టుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు భైఠాయింపు.

పోలీసుల జూలుం నశించాలని అశోక్ కుమార్ పై పెట్టిన అక్రమ సెక్షన్లు ఎత్తివేయాలని డిమాండ్. రాత్రంతా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు బిజెపి జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ కామెంట్స్.

శాంతియుతంగా నిమజ్జనం చేస్తున్న బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పోలన అశోక్ కుమార్ చేసిన ఆర్గిమెంటును బూచిగా చూపి స్టేషన్ పిలిచారని డీజే విషయంపై అశోక్ కుమార్, పోలీసులకు మధ్య తలెత్తిన వివాదం. బెయిలబుల్ సెక్షన్లో ఉన్న అక్రమ సెక్షన్లో బలయించారని 41 నోటీస్ ఇచ్చి పంపించమంటే రాత్రంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని ఇప్పటికి కూడా అడిషనల్ సెక్షన్లు పెడతామని బెదిరిస్తున్నారని. ఎవరి ప్రోద్బలం తో పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించారు.

ఎవరికోసం పోలీసులు ఈ విధంగా చేస్తున్నారో మాకు తెలుసు అన్నారు. హిందువులపై పక్షపత ధోరణి కనిపిస్తుందన్నారు. అశోక్ కుమార్ పై అక్రమంగా బనాయించిన కేసులను రద్దుచేసి బేసరత్తుగా విడుదల చేయాలని డిమాండ్.

Bhanu, Pamarru

Bhanu, Pamarru