Krishna: పెడనలో టీడీపీలోకి 25 మంది వైసీపీ కార్యకర్తల చేరిక!
Krishna: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం జింజేరు గ్రామానికి చెందిన 25 మంది వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
Krishna: పెడనలో టీడీపీలోకి 25 మంది వైసీపీ కార్యకర్తల చేరిక!
కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా పెడన,నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పెడన నియోజకవర్గం తోటమూలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెడన రూరల్ మండలం జింజేరు గ్రామానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జింజేరు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 25 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలోకి చేరడం జరిగింది. అని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు . పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములు కావాలని సూచించమన్నారు .
ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ అభివృద్ధి తదితర అంశాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించమన్నారు . గ్రామంలో ప్రజల మద్దతుతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించమన్నారు .అదేవిధంగా జింజేరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై స్థానిక నాయకులు, పార్టీ ముఖ్యులతో చర్చించి కారే ఝాన్సీ ని సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగిందిఅని పేర్కొన్నారు . గ్రామ ప్రజల ఆదరాభిమానాలు, నాయకులు మరియు కార్యకర్తల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




