Gannavaram: రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు మల్లికార్జున స్కూల్ విద్యార్థి!
Gannavaram: రాష్ట్ర స్థాయి జూడో సబ్ జూనియర్స్ పోటీలకు గన్నవరం మల్లికార్జున స్కూల్ విద్యార్థి మానికొండ సాయి ప్రశాంత్ ఎంపికైనట్లు రాష్ట్ర జూడో అసోసియేషన్ కార్యదర్శి తెలిపారు.
Gannavaram: రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు మల్లికార్జున స్కూల్ విద్యార్థి!
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం రాష్ట్రస్థాయి జూడో సబ్ జూనియర్స్ పోటీలకు గన్నవరం మల్లికార్జున స్కూల్ విద్యార్థి మానికొండ సాయి ప్రశాంత్ ఎంపికైనట్లు రాష్ట్ర జూడో అసోసియేషన్ కార్యదర్శి నామిశెట్టి వెంకట్ గురువారం తెలిపారు. మైనస్ 56 విభాగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.
ఈనెల 14 15 తేదీల్లో గన్నవరం మల్లికార్జున స్కూల్ ఆవరణలో రాష్ట్రస్థాయిలో జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు డిసెంబర్ నెలలో జాతీయస్థాయిలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఎన్ మాధవి లత తదితరులు పాల్గొన్నారు.




