Vuyyuru: ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి!

Vuyyuru: కృష్ణాజిల్లా ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పాముకాటుకు గురైన బెల్లపు లీలా కృష్ణ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Ramana, Penamaluru
Published on: 28 Nov 2026 8:57 AM IST
Vuyyuru
X

Vuyyuru: ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి!

ఉయ్యురు: ఈనెల 7వ తేదీ (7/11/26)పాముకాటుకు గురై ఆస్పత్రిలో చేరిన పమిడిముక్కల మండలం మంటాడ గ్రామానికి చెందిన బెల్లపు లీలా కృష్ణ, ఆస్పత్రి సిబ్బంది సరిగా వైద్యం చేయకపోవడంతో మృతి చెందిన లీలా కృష్ణ. పాము కాటు తో చనిపోయిన వ్యక్తి గురించి పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వకుండా పోస్టుమార్టం చేయకుండా మృతదేహాన్ని హుటాహుటిన ఆసుపత్రి నుంచి పంపించేసిన ఆసుపత్రి సిబ్బంది.

మృతుడి అక్క సుబ్బలక్ష్మి సమాచారంతో వెలుగులోకి వచ్చిన ఘటన, తన తమ్ముడు చనిపోయినట్లు పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు అంటూ డ్యూటీ డాక్టర్ పుష్పక శ్రీనివాస్ ను వివరణ అడిగిన అక్క సుబ్బలక్ష్మి. పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన డ్యూటీ డాక్టర్ హాస్పిటల్ సిబ్బంది కలిసి తనను మోసం చేసి సంతకాలు పెట్టించుకున్నారు. అంటూ వాపోతున్న మృతుని అక్క సుబ్బలక్ష్మి.

ఆస్పత్రి వద్ద తనకు న్యాయం జరగకపోవడంతో స్పందనలో ఫిర్యాదు చేసిన మృతుని అక్క సుబ్బలక్ష్మి. స్పందనలో ఫిర్యాదు చేసినందుకు ఆసుపత్రి సూపరిండెంట్ మరియు డ్యూటీ డాక్టర్ తనను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ వాపోతున్న మృతుని అక్క సుబ్బలక్ష్మి. లీలా కృష్ణ మృతితో తన తల్లి మనోవేదనకు గురై అనారోగ్యంతో ఉందని వాపోతున్న సుబ్బలక్ష్మి

తన తమ్ముడు మృతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని వృద్ధురాలైన తన తల్లికి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న మృతుని అక్క సుబ్బలక్ష్మి.

Ramana, Penamaluru

Ramana, Penamaluru