Pedana: విజనరీ 2026 నేషనల్ అవార్డు అందుకున్న నార్ని అమరచంద్ వశిష్ట!

Pedana: ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నార్ని అమరచంద్ వశిష్ట హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక విజనరీ 2026 నేషనల్ అవార్డు అందుకున్నారు.

Reddy, Pedana
Published on: 17 Nov 2026 5:48 PM IST
Pedana
X

Pedana: విజనరీ 2026 నేషనల్ అవార్డు అందుకున్న నార్ని అమరచంద్ వశిష్ట!

పెడన: ఆధ్యాత్మిక మరియు సేవా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన విజనరీ 2026 నేషనల్ అవార్డు (డి అండ్ ఎస్ ) ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకులు నార్ని అమర చందు వశిష్ట అందుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బిర్లా టెంపుల్ ఆడిటోరియంలో పాన్ ఇండియా కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ జాతీయ పురస్కారాన్ని పొందారు.

ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి , ప్రముఖ సినీ నటులు సుమన్ , తెలంగాణ మాజీ మంత్రి మధుసూదనాచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన, ధార్మిక సేవ, సమాజ హితం పట్ల అంకితభావంతో గురువుగారు చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం మనందరికీ గర్వకారణం అన్నారు.ఈ అవార్డు వారి సేవా ప్రయాణానికి మరింత స్ఫూర్తినిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

వారి ఆధ్యాత్మిక సేవలు మరింత విస్తరించి, సమాజానికి, ధర్మానికి మరిన్ని సేవలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు .అనంతరం ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశామన్నారు.

Reddy, Pedana

Reddy, Pedana