Pedana: కోడూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన తహసీల్దార్!

Pedana: తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కృష్ణాజిల్లా పెడన తహసీల్దార్ వహీదా, ఏవో జెన్నీ సూచించారు.

Reddy, Pedana
Published on: 17 Nov 2026 5:07 PM IST
Pedana
X

Pedana: కోడూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన తహసీల్దార్!

పెడన: అక్వాన్ తుఫాన్ దూసుకు వస్తున్న నేపథ్యంలో రైతులందరూ తమ ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించాలని తుఫాన్ నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ వహీదా రెహమాన్, మండల వ్యవసాయ అధికారి సజ్జా. జెన్నీ రైతులకు సూచించారు. ఈ మేరకు మండల పరిధిలో గల కోడూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో రైతులందరిని అప్రమత్తంగా ఉండమని కోసిన ధాన్యాన్ని మిల్స్ కి ధాన్యం కొనుగోలు కేంద్రాలలకు పంపించాలని సూచించారు.అన్ని రైతు సేవ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని,వరి కోసిన రైతులు ధాన్యం మిల్స్ కి లేదా మార్కెట్ ధర బయట ఎక్కువగా ఉన్నందున రైతులు బయటకు పంపిచ్చుటకు మక్కువ చూపిస్తున్నందున,ధాన్యం సురక్షితమైన ప్రాంతాలకు తరలించాల్సిందిగా రైతులను కోరామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ,రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Reddy, Pedana

Reddy, Pedana