Pedana: తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఏవో!

Pedana: తుఫాను ముప్పు నేపథ్యంలో కృష్ణాజిల్లా గూడూరు మండల రైతులు అప్రమత్తంగా ఉండి పంటల రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి శివరామకృష్ణ సూచించారు.

Reddy, Pedana
Published on: 17 Nov 2026 5:10 PM IST
Pedana
X

Pedana: తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఏవో!

పెడన: తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి పంటల రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని గూడూరు వ్యవసాయ అధికారి శివరామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెబుతూ,కోసిన వరి పనలను పొలాల్లో వదిలేయకుండా సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలకు తరలించి ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పుకోవాలని రైతులను కోరారు.

Reddy, Pedana

Reddy, Pedana