Gannavaram: రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గన్నవరం విద్యార్థులు ఎంపిక!
Gannavaram: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 ఫెన్సింగ్ పోటీలకు కృష్ణాజిల్లా గన్నవరం విద్యార్థులు మానికొండ సాయి సత్య చిన్మయి, డి. నాగ పియూష ఎంపికయ్యారు.
Gannavaram: రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గన్నవరం విద్యార్థులు ఎంపిక!
గన్నవరం: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ 19 ఫెన్సింగ్ పోటీలకు గన్నవరం చెందిన మానికొండ సాయి సత్య చిన్మయి ( ఇప్పి ) విభాగం లో, డి నాగ పియూష (సాబర్ ) విభాగంలో ఎంపికైనట్లు డి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు నంద్యాలలో జరిగే రాష్ట్రస్థాయి స్కూల్ ఫెడరేషన్ ఫెన్సింగ్ పోటీలకు కృష్ణా జిల్లా తరఫున ప్రాతినిత్యం వహిస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో కూడా మంచి ప్రతిభ కనపరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అవ్వాలని కోరుకున్నారు.




