Gannavaram: వేడెక్కిన గన్నవరం రాజకీయాలు.. ఎమ్మెల్యేపై అనగాని రవి విమర్శలు!
Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలపై వైసీపీ జడ్పీటీసీ అనగాని రవి శుక్రవారం మీడియా సమావేశంలో కౌంటర్ ఇచ్చారు.
Gannavaram: వేడెక్కిన గన్నవరం రాజకీయాలు.. ఎమ్మెల్యేపై అనగాని రవి విమర్శలు!
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడిన మాటలకు స్పందించిన మొన్న జడ్పిటిసి గా గెలిచిన అనగాని రవి. గన్నవరం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. జడ్పిటిసి అనగానే రవి మాట్లాడుతూ నువ్వు గెలిచి మూడేళ్లు అయింది మూడేళ్లలో నువ్వు ప్రజలకు ఏం చేశావు చెప్పు. జడ్పిటిసిగా గెలిచిన నన్ను రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవమంటున్నావు.
మీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్కు రా, నా మీద పోటీ చేసి గెలువు, 2029లో వంశీ మీద పోటీ చేసి ఆప్పుడు గెలుద్దువు గాని. నువ్వు రాజకీయాల్లోకి వైసీపీ నుండి వచ్చావు జగన్ సీటు ఇవ్వకపోయేసరికి టిడిపికి వెళ్లి ఆ గాల్లో ఎమ్మెల్యేగా గెలిచావు. గన్నవరం నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నడుపుతుంది నువ్వు కాదా. మాట్లాడితే పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం పేర్లు మాట్లాడుతున్నావు నీకు వాళ్లు తెలుసా. నేను చిన్నప్పటినుంచి సుందరయ్య గారితో ఉండి గన్నవరం రాజకీయాల్లో ఉన్నాను. మా కుటుంబం 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంది.
మా నాన్న 27 సంవత్సరాలు సర్పంచిగా, మా అమ్మ అయిదు సంవత్సరాలు సర్పంచ్ గా, నేను ఐదు సంవత్సరాలు సర్పంచిగా ఎంపీపీగా చేసాము. బీసీలు ఎస్సీలు ఎస్టీలను వదిలేసి నామినేటి పదవులు మీ వర్గానికి చెందిన వాళ్లకు ఇచ్చుకున్నావు. గన్నవరాన్ని అభివృద్ధి చేశాను అని చెప్పుకుంటూ తప్ప అభివృద్ధి శూన్యం. మాట్లాడితే నేను 63 ఓట్లతోనే గెలిచాను అంటున్నావు, టిడిపికి చెందిన ఎంపీటీసీలు 5, 10, 20 ఓట్లతో గెలిచిన వాళ్లు కూడా ఉన్నారు ముందు అది చూసుకో.
నువ్వు సాధారణ రైతు కుటుంబంలో పుట్టావు ఏదో డబ్బు వచ్చిందని చెప్పి అది చేశాను ఇది చేశాను అని చెబుతున్నావు, పుచ్చలపల్లి సుందరయ్య గారికి మల్లె త్యాగాలు ఏమైనా చేసావా, త్వరలోనే ప్రజలు మీకు పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెబుతారు.




