Krishna: కృష్ణా జిల్లా బాక్సింగ్‌లో గరికపర్రు, ఉయ్యూరు విద్యార్థుల సత్తా
Krishna: కృష్ణా జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో గరికపర్రు, ఉయ్యూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు 3 బంగారు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
Krishna: కృష్ణా జిల్లా బాక్సింగ్‌లో గరికపర్రు, ఉయ్యూరు విద్యార్థుల సత్తా
కృష్ణా జిల్లా: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణలంక హైస్కూల్ లో నిర్వహించిన కృష్ణా జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలలో ZPH స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు.
1. అండర్-14 బాయ్స్ విభాగం (42-44 కేజీలు): ZPH స్కూల్, గరికపర్రు విద్యార్థి ఉయ్యూరు శ్రీ హర్ష, S/o శివ నాగరాజు జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాడు.
2. అండర్-14 బాయ్స్ విభాగం (40-42 కేజీలు): ZPH స్కూల్, గరికపర్రు విద్యార్థి ఇంటూరి హర్ష, S/o రాము జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాడు.
3. అండర్-17 బాయ్స్ విభాగం (48-50 కేజీలు): ZPH స్కూల్, ఉయ్యూరు విద్యార్థి ఎస్. రాజేష్ జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాడు.
ఈ ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి, ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు ప్రకాశం జిల్లా, ఒంగోలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
విద్యార్థులను ఉయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు గారు మరియు బాక్సింగ్ కోచ్ సూరి గారు గరికపర్రు ZPH స్కూల్ PET టీచర్ భవాని గారు, ఉయ్యూరు ZPH స్కూల్ PET టీచర్ లు అభినందించారు.




