Kankipadu: కంకిపాడు ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన కోదికాలం

Kankipadu: కృష్ణా జిల్లా కంకిపాడు ఎస్‌ఐగా కోదికాలం బాధ్యతలు స్వీకరించారు. చలివేంద్రపాలెం గ్రామస్థులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Ramana, Penamaluru
Published on: 1 Oct 2026 5:47 PM IST
Kankipadu
X

Kankipadu: కంకిపాడు ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన కోదికాలం

కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్‌ స్టేషన్‌లో నూతన ఎస్‌ఐగా కోదికాలం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉయ్యూరు టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన ఆయన తక్కువ కాలంలోనే ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని, ప్రజల అభిమానాన్ని పొందారు.

తాజాగా కంకిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చలివేంద్రపాలెం గ్రామానికి చెందిన ఆళ్ళ శ్రీనివాసరెడ్డి ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఆకాంక్షించారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru