Krishna: ఒక్కింటి వాడి రాజకీయం.. 860 ఓట్లతో సంచలనం!

Krishna: పెడన మండలం కొంకెపూడిలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే కట్టా నాగరాజు పీఏసీఎస్ అధ్యక్షుడిగా, భార్య నాగ తిరుమల 860 ఓట్ల మెజారిటీతో ఎంపీటీసీగా గెలిచారు.

Reddy, Pedana
Published on: 14 Nov 2026 10:54 AM IST
Krishna
X

Krishna: ఒక్కింటి వాడి రాజకీయం.. 860 ఓట్లతో సంచలనం!

Krishna: బంధువుల బలగం లేదు కుటుంబ నేపథ్యం లేదు.. రాజకీయ అండదండలు అంతకన్నా లేవు! అయినా మంచితనమే పెట్టుబడిగా ఎన్నికల బరిలో నిలిచి అంచనాలను తలకిందులు చేశారు.

కృష్ణాజిల్లా పెడన మండలం కొంకెపూడి గ్రామంలో కట్టా నాగరాజు కుటుంబం ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. భర్త పీఏసీఎస్ అధ్యక్షుడిగా,భార్య నాగ తిరుమల ఎంపీటీసీగా విజయం సాధించారు.

బలమైన బంధుత్వ నేపథ్యమున్న ప్రత్యర్థిపై 860 ఓట్ల మెజారిటీతో గెలిచి ఒక్కింటి వాడి వెనుక ఊరంతా నిలిస్తే రాజకీయ చరిత్ర సృష్టించవచ్చని నిరూపించారు.

Reddy, Pedana

Reddy, Pedana