Kankipadu: కంకిపాడులో అర్ధరాత్రి దారుణం.. బీహార్ యువకుడు హత్య!
Kankipadu: కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో దారుణం. డైరీ ఫారంలో పనిచేస్తున్న బీహార్ యువకుడు అనిల్ కత్తిపోట్లతో హత్య. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.
Kankipadu: కంకిపాడులో అర్ధరాత్రి దారుణం.. బీహార్ యువకుడు హత్య!
Kankipadu: కంకిపాడులో అర్ధరాత్రి దారుణ హత్య.. చికిత్స పొందుతూ బీహార్ యువకుడు మృతి, మండల కేంద్రమైన కంకిపాడు గ్రామ శివారులోని ఓ డైరీ ఫారంలో అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. డైరీ ఫారంలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన అనిల్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు.
సోమవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తుల దాడి నుంచి తప్పించుకున్న అనిల్ తీవ్ర గాయాలతో అక్కడి నుంచి పారిపోయి, సమీపంలోని ఓ పాకలో నిద్రిస్తున్న వ్యక్తిని నిద్రలేపాడు. అనంతరం స్పృహ తప్పి పడిపోయాడు.
వెంటనే డైరీ ఫారం యజమానికి సమాచారం అందించడంతో, ఆయన అనిల్‌ను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి వేళ జరిగిన ఈ హత్య వెనుక గల కారణాలు, దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. గుర్తుతెలియని దుండగుల ఆచూకీ కోసం విచారణ కొనసాగిస్తున్నారు.




