Kanchikacharla: కంచికచర్లలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం: సిబ్బందికి సన్మానం
Kanchikacharla: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల 6వ అంగన్‌వాడీ కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్, పోషణ్ మాసం వేడుకల్లో భాగంగా అంగన్‌వాడీ సిబ్బందిని ఘనంగా సత్కరించారు.
Kanchikacharla: కంచికచర్లలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం: సిబ్బందికి సన్మానం
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ: అంగన్‌వాడీ 6 కేంద్రంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని చేపట్టిన ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది...
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ్ మాసం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి...
ఈ సందర్భంగా కంచికచర్ల మండల అధ్యక్షులు కాలవ మహేష్ బాబు మాట్లాడుతూ:
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారం, మాతృ సంరక్షణ, వ్యాక్సినేషన్ తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు...
పథకాల ప్రయోజనాలపై లబ్ధిదారుల నిజమైన అనుభవాలను, అభిప్రాయాలను నమోదు చేశారు. చిన్నారులకు ఉత్సాహంగా వినోద క్రీడలు, కార్యక్రమాలను ఏర్పాటు చేశారు...
ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY), మిషన్ ఇంద్రధనుష్, పోషణ్ భీ-పఢాయి భీ, బేటీ బచావో-బేటీ పఢావో, ప్రసూతి నగదు బదిలీ వంటి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు...
అనంతరం కేంద్రంలో విశేష సేవలందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు...
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కంచికచర్ల మండల అధ్యక్షులు కాలవ మహేష్ బాబు,ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అన్నపాగ శ్రీకాంత్,నందిగామ నియోజకవర్గ అంగన్వాడి ఉత్సవ్ కార్యక్రమం ఇంచార్జ్ దేవరకొండ రమాదేవి, కంచికచర్ల అంగన్వాడీ 6 ఉత్సవ కార్యక్రమం ఇంచార్జ్ కాలవ సాయి పూజిత, కంచికచర్ల మండల బిజెపి ఇన్చార్జ్ తొర్లికొండ సీతారామయ్య మరియు ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు...




