Gannavaram: ఎమ్మెల్యే యార్లగడ్డపై జనసేన నేత చలమల శెట్టి రమేష్ సంచలన వ్యాఖ్యలు!
Gannavaram: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రెస్‌మీట్‌పై జనసేన సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gannavaram: ఎమ్మెల్యే యార్లగడ్డపై జనసేన నేత చలమల శెట్టి రమేష్ సంచలన వ్యాఖ్యలు!
Gannavaram: మొన్న కానూరు యార్లగడ్డ గార్నియర్ వేదిక గా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహించి, స్థానిక పంచాయతీ ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాన్ని గురించి, నియోజకవర్గంలో జరుగుతున్న విధివిధానాలు గురించి మీడియాతో మాట్లాడటం జరిగింది.
బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ జనసేన నాయకుడు (ప్రస్తుత బాపులపాడు సర్పంచ్ తన సతీమణి) జనసేన గన్నవరం సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిర్వహించిన మీడియా సమావేశం సారాంశంలో తప్పులున్నాయంటూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుపై సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం జరిగింది.
ఈ సందర్భంగా జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ మాట్లాడుతూ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు అంటే మాకు ఇప్పటికీ ఎప్పటికీ గౌరవమే. కానీ మొన్న ప్రెస్మీట్లో కొన్ని అబద్ధాలు చెప్పడం జరిగింది.
బాపులపాడు సర్పంచ్గా నా సతీమణి నిలబడినప్పుడు , ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ ఉదయభాను రావడానికి ఎమ్మెల్యే తప్పు పట్టారు. జనసేన పార్టీ తరఫున మా నాయకుడు జంక్షన్ రావడానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి వచ్చారే తపితే మరి ఏ అపార్థం లేదు.
నేను గతంలో మిమ్మల్ని పార్టీలో ఆర్థికంగా నష్టపోయాను ఏదైనా నిజాయితీ గల వ్యాపారం ఇప్పించండి అని అడిగిన మాట వాస్తవం. రెండు సంవత్సరాల గడుస్తున్న నాకు ఏ వ్యాపారం చూపించలేదు.
జంక్షన్లో మద్యం షాపు చింతమనేని ప్రభాకర్ గారిది, ఆయన సిండికేట్ వారికి డబ్బులు కట్టి నేను షాపును రన్ చేసుకుంటున్నాను. బాపులపాడు సర్పంచ్గా నేను పోటీ చేస్తాను అని మీతో చెప్పాను, కానీ మీరు ఏ విషయం చేయమని చేయవద్దని నాతో చెప్పలేదు.
నేను మీతో కలిసి వచ్చిన తర్వాత, హడావుడిగా బాపులపాడు తెలుగుదేశం నాయకులు ప్రెస్టేజ్ గా తీసుకుని నాపై పోటీగా తెలుగుదేశం అభ్యర్థిని అప్పటికప్పుడు నియమించారు. మొన్న జరిగిన ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో జనసేన వారికి మీ సంత డబ్బులు ఇచ్చానని అంటున్నారు, అది తప్పు మీ డబ్బులు ఇవ్వలేదు.
మా జనసేన ఎంపీపీ ప్రమీల రాణి ఇచ్చిన డబ్బులను మీరు మా జనసేన ఎంపీటీసీ సభ్యులకు ఇచ్చారు అంతేగాని మీ డబ్బు కాదు. మార్కెట్ యార్డ్ చైర్మన్ విషయంలో జనసేనకు అన్యాయం జరిగింది.
జనసేనకు గరికపాటి శంకర్ కు ఇచ్చిన పదవిని, వెనక్కి తీసుకుని మీ అనుచరులకు ఇచ్చారు. మా జనసేన నాయకులంతా అయితే మీకు రావాలి లేదా శంకర్ కి రావాలని నన్ను ఒత్తిడి చేశారు. అప్పుడు కూడా మిమ్మల్ని నేను అడగలేదు.
నేను పెద్ద నాయకుడిని నాకు పెద్ద పదవి ఇస్తానని రెండు సంవత్సరాలు పైనుండే అంటున్నారు, కానీ ఇప్పుడు వరకు లేదు.
మీరు ప్రతి ఒక్కడు హీరోలాగా ఫీలవుతున్నారు అని అంటున్నారు, మేము హీరో లాగా ఫీల్ అవ్వటం లేదు ప్రజల కోసం కష్టపడి పని చేస్తున్నాము. మేమైతే మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నాము, మీరు మాతో కలిసి ఉంటారో లేదో మీకే తెలియాలి.




