Krishna: ఉయ్యూరులో కలకలం రేపుతున్న అక్రమ లేఅవుట్ల దందా!

Krishna: కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు కలకలం. పూర్తి వివరాలు.

Ramana, Penamaluru
Published on: 29 Sept 2026 11:59 AM IST
Krishna
X

Krishna: ఉయ్యూరులో కలకలం రేపుతున్న అక్రమ లేఅవుట్ల దందా!

Krishna: వ్యవసాయ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఉయ్యూరు పట్టణానికి సమీపంలోని సుమారు 9 ఎకరాల వ్యవసాయ భూమిలో అనుమతులు లేకుండానే లేఅవుట్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెట్టుబడి పేరుతో అమాయకులను ఆకర్షించి ప్లాట్లు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు గద్దలమారి గుంట చెరువు పరిధిని ఆక్రమిస్తూ రోడ్డు నిర్మించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. కనీసం నాలా ట్యాక్స్ చెల్లించకుండానే 20కి పైగా ప్లాట్లు విక్రయించారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు.. కామన్ సైట్లను సైతం విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి.

కపిలేశ్వరపురం గ్రామ అధికారులు, పమిడిముక్కల మండల అధికారులు ఈ వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టిడ్కో ఇళ్లను చూపిస్తూ అక్రమ లేఅవుట్లకు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

అసలు ఈ లేఅవుట్‌కు అనుమతులు ఉన్నాయా?

వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చేందుకు నిబంధనలు పాటించారా?

చెరువు భూమి ఆక్రమణపై అధికారులు ఏం చెబుతున్నారు?

కామన్ సైట్ల విక్రయాలపై చర్యలు ఎందుకు లేవు?

ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.

Ramana, Penamaluru

Ramana, Penamaluru