Krishna: హనుమాన్ జంక్షన్ ఎస్ఐ తీరు మార్చుకోవాలని వంశీ డిమాండ్!

Krishna: హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఎన్నికల భద్రత పేరుతో ఒకే పార్టీని టార్గెట్ చేయడం తగదని పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 6:42 PM IST
Krishna
X

Krishna: హనుమాన్ జంక్షన్ ఎస్ఐ తీరు మార్చుకోవాలని వంశీ డిమాండ్!

కృష్ణ: హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద వంశీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వాలు పనిచేయాలి, పోలీసులు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు. ఎలక్షన్ దృష్ట్యా ముందస్తు భద్రత చర్యలు తీసుకోవడం మంచిదే. కానీ ఒక పార్టీ వారిని టార్గెట్ చేయకూడదు. వైసిపి నాయకులను కార్యకర్తలను ఇళ్లకు వెళ్లి మరీ పోలీసులు వేధిస్తున్నారు.

ముందు నోటీస్ పంపిస్తే మేము స్టేషన్ కి వస్తాము అంతేగాని చట్టాన్ని మరిచి మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. అధికార పార్టీ వారిపై కూడా బైండోవర్లో ఉన్నాయి. వారిని కూడా స్టేషన్ కి పిలిపించాలి. స్థానిక హనుమాన్ జంక్షన్ ఎస్సై తీరు మార్చుకోవాలి. అమ్మ నాయకులను బూతులు తిడు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడు. జంక్షన్ ఎస్ఐ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నాము.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్