Pedana: పెడనలో ఘనంగా మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు!

Pedana: కృష్ణ జిల్లా పెడన విశ్వభారతి హైస్కూల్‌లో మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు.

Reddy, Pedana
Published on: 21 Sept 2026 5:19 PM IST
Pedana
X

Pedana: పెడనలో ఘనంగా మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు!

Pedana: పండితులు చేసే రచనలు వాడుక భాషలో అందరికీ అర్థమయ్యే విధముగా రచనలు చేసే మహాకవి, రచయిత,సంఘసంస్కర్త గురజాడ అప్పారావు అని ఏ.గౌరీ ప్రసాద్ తెలియచేశారు.స్థానిక విశ్వభారతి హైస్కూల్ నందు జరిగిన గురుజాడ అప్పారావు జయంతి వేడుకలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఆయన మాట్లాడుతూ సాంఘిక దురాచారాలను ఎదుర్కొంటానికి ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం,"దేశమును ప్రేమించుమన్నా"దేశభక్తి గీతం,ముత్యాలసరాలు గేయం ఎంతగానో ప్రసిద్ధిపొందయి.సెప్టెంబర్ 21 ఆయన జయంతి రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయిని మట్టా లావణ్య, విద్యార్దులు పాల్గొన్నారు.

Reddy, Pedana

Reddy, Pedana