Gannavaram: గన్నవరం వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా మోదుగుమూడి నామినేషన్!

Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం గ్రామ పంచాయతీ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బలపరిచిన మాజీ ఎంపీటీసీ మోదుగుమూడి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Nov 2026 4:13 PM IST
Gannavaram
X

Gannavaram: గన్నవరం వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా మోదుగుమూడి నామినేషన్!

గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వంశి బలపరిచిన మాజీ ఎంపీటీసీ మోదుగమూడి వెంకటేశ్వరరావు గన్నవరం పంచాయతీ కార్యాలయంలో ఆర్ఓ కి నామినేషన్ పత్రాలు సమర్పించి దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోదుగుముడి వెంకటేశ్వరరావు యం వి ఆర్ మాట్లాడుతూ 2000 నుండి 2020 సంవత్సరం వరకు ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందించాను.

మా పెద్దనాన్న గారు ఇదే గ్రామ పంచాయతీకి 30 సంవత్సరాల క్రితం వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహించారు. 2014లో బిజెపి నుంచి నేను ఎంపీటీసీగా గన్నవరం టౌన్ కి ప్రజలకు సేవలందించాను. మా కుటుంబము గత 50 సంవత్సరాల నుండి రాజకీయంలో ప్రజలతో మమేకమై ఉన్నాము. వంశీ గారితో పాటు మేము కూడా పార్టీ మారాము.. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వంశీ గారి సమక్షంలో బడుగు బలహీన వర్గాల ప్రజల దీవెనలతో సర్పంచ్ గా గెలిచి ప్రజలకు సేవ చేస్తా.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏరియాలలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. నేను గెలిచిన తర్వాత ప్రధమ ప్రాధాన్యత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తాను, ప్రజలందరూ నన్ను దీవించి నాకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్