Gannavaram: గన్నవరం విమానాశ్రయంలో ‘యాత్రి సేవా అభియాన్’ ప్రారంభం!

Gannavaram: గన్నవరం ఎయిర్‌పోర్టులో యాత్రి సేవా అభియాన్, స్వచ్ఛతా హీ సేవా-2026 కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Sept 2026 11:38 PM IST
Gannavaram
X

Gannavaram: గన్నవరం విమానాశ్రయంలో ‘యాత్రి సేవా అభియాన్’ ప్రారంభం!

గన్నవరం: గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ ఏకే లక్ష్మీకాంత్ రెడ్డి మీడియా సమావేశం, ప్రజలకు విమాన ప్రయాణం క్షేమం సౌలభ్యం కొరకు అవగాహన కార్యక్రమాలు, యాత్రి సేవ అభినయ్, స్వచ్ఛతా హి సేవ 2026 రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు విమానాశ్రయంలో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ రెడ్డి, ఎయిర్ పోర్టు డైరెక్టర్ యాత్రి సేవా అభియాన్ రేపటి నుంచీ అక్టోబర్ 10 వరకూ ప్రతీరోజూ ఒక ఈవెంట్ చేస్తాం. సెప్టెంబరు 17, సెప్టెంబరు 27, అక్టోబర్ 2, అక్టోబర్ 10 లలో సివిల్ ఏవియేషన్ మంత్రి పలు ప్రాంతాలలో పర్యటిస్తారు

24 రోజుల్లో 24 కార్యక్రమాలు నిర్వహిస్తాం, ప్యాసింజర్ సేవలు, సౌకర్యాలు, ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు ప్యాసింజర్ లకు తెలుపుతాం సెక్యూరిటీ ప్రధానంగా ఫాలో అవుతాం. డిజిటల్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ కూడా అందరికీ తెలిసేలా‌ చేస్తాం.

డిజి యాత్ర ఎలా వినియోగించాలి అనే అశం పై అవగాహన కలిగిస్తాం, విమాన సమాచారం ఎలా ఉందో అనేది పరిశీలిస్తాం, గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఎయిర్ పోర్టు అంశం పై ఒకరోజు ఈవెంట్ ఉంటుంది, పాము కాటు నుంచి ప్రతీ దానికి మెడిసిన్ ఎయిర్ పోర్టులో అందుబాటులో‌ ఉంటుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్