Pamarru: ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాపై కైలే అనిల్ కుమార్ ఫైర్!
Pamarru: పామర్రు వైసీపీ కార్యాలయంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాపై రూ.10 కోట్లు, 10% కమిషన్ల ఆరోపణలు గుప్పించారు.
Pamarru: ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాపై కైలే అనిల్ కుమార్ ఫైర్!
కృష్ణా: పామర్రు నియోజకవర్గం, పామర్రు వైసిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పై ఘాటు విమర్శలు గుప్పించారు. మొవ్వ లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ పై నువ్వు నియమించిన అభ్యర్థిని ఓడగొట్టి నీ కక్ష తీర్చుకునావు, తాడిశెట్టి నరేష్ ను నువ్వు చరిత్రలో లేకుండా చేయటానికి, తాడిశెట్టి నరేష్ ను మొవ్వ తీసుకెళ్ళి ఓడగొట్టావు.
ఏ సామాజిక వర్గం వారు అయితే నీకు బట్టలు కొనిచ్చారో... ఏ సామాజిక వర్గం వారు అయితే నిన్ను కారులో ఎక్కించుకుని తిరిగారో ... వారిని నువ్వు బూతులు తిట్టావు, పవన్ కళ్యాణ్ ని అక్కున చేర్చుకున్న సామాజిక వర్గం వారిని నువ్వు బూతులు తిట్టావు, జడ్పీ చైర్ పర్సన్ పదవి ఇవ్వటానికి పమిడిముక్కల జడ్పిటిసీ నుంచి పది కోట్లు తీసుకున్నావని ఆరోపించారు.
తండ్రి ఎమ్మెల్సీ వర్ల రామయ్య, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా లు కలిసి రాష్ట్రాన్ని దోచుకునే పందాలో ఉన్నారు. దీనికి ఉదాహరణ పమిడి ముక్కల మండల జడ్పిటిసి తాతినేని ప్రవళికకు జడ్పీ చైర్పర్సన్ పదవి ఇస్తానని 10 కోట్లు తీసుకున్న ఘనత వర్ల కుమార్ రాజా కే చెందిందన్నారు. రెండున్నరేళ్లలో పామర్రు పంచాయతీని దోచుకున్నారు.
ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పంచాయతీలో 10% కమిషన్ తీసుకుని దొంగ బిల్లులు పెడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యే తాగే టీ ఖర్చు కూడా పంచాయతీ నుంచి వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కార్యాలయాన్ని సచివాలయం పై నిర్మించారు. పామర్రు పంచాయతీని అస్తవ్యస్తం చేశారు. గాంధీజీ తీసుకొచ్చిన గ్రామ స్వరాజ్యాన్ని నువ్వు కాల రాశావు అన్నారు.
నువ్వు డబ్బు...ఆహంకారంతో గెలుద్దాం అనుకున్నావు.. రేపు రాబోయే ఎలక్షన్లలో ప్రజలు నీకు బుద్ధి చెబుతారు. ఈ ఎన్నికల్లో పామర్రు పంచాయతీ పై వైఎస్ఆర్ జెండాని ఎగురవేసి తీరుతామన్నారు. గత ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో ప్రజలు మాకు ఓటింగ్ ఇచ్చారు. పామర్రు ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెట్టిన... పోలీసులతో బెదిరించిన మా ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదు అన్నారు.
మొవ్వ మండలంలో కులాల కుంపట్లు పెట్టినా... కొన్ని గ్రామాల్లో కన్నీరు కార్చిన గెలవలేకపోయారన్నారు. మొవ్వ మండలంలో జడ్పిటిసి గెలవ పోవటం చూస్తే ప్రజలకు ఎమ్మెల్యే పై ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతుంద, ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో కూడా మేము గెలిచి తీరుతా ఉన్నారు.




