Krishna: కృష్ణా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్‌గా డా. జి. భానుమూర్తి నియామకం!

Krishna: ప్రతిష్టాత్మక కృష్ణా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్‌గా జిల్లా అంధత్వ నివారణ అధికారి డా. జి. భానుమూర్తి నియమితులయ్యారు.

Reddy, Pedana
Published on: 17 Nov 2026 9:51 AM IST
Krishna
X

Krishna: కృష్ణా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్‌గా డా. జి. భానుమూర్తి నియామకం!

Krishna: ప్రతిష్టాత్మక కృష్ణా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ గా జిల్లా అంధత్వ నివారణ అధికారి డా. జి. భానుమూర్తి నియమితులయ్యారు. ఆయనతో పాటు మచిలీపట్నం సర్వజన వైద్యశాల పర్యవేక్షణ అధికారి డా. పద్మశ్రీ, ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజీ వైద్యుడు డా. కల్యాణ్ రావు కూడా కమిటీలో చోటు దక్కించుకున్నారు.

వీరి పదవీ కాలం ఒక సంవత్సరం పాటు ఉంటుంది. కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కళాశాలల్లో హాస్పిటల్, మెడికల్ కోర్సులకు సరిపడే సిలబస్, విధి విధానాలను వీరు నిర్ణయించనున్నారు.

ఈ మేరకు కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. రాంజీ నియామక పత్రాన్ని విడుదల చేశారు. నియామకం పట్ల పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు డా. భానుమూర్తి తదితరులకు అభినందనలు తెలిపారు.

Reddy, Pedana

Reddy, Pedana