Penamaluru: 9 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీ పత్రాల అందజేత!

Penamaluru: పెనమలూరు నియోజకవర్గంలో రూ.8,95,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ (CMRF) ఎల్‌వోసీ పత్రాలను అందజేసిన టీడీపీ నాయకులు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చొరవ.

Ramana, Penamaluru
Published on: 24 Sept 2026 5:28 PM IST
Penamaluru
X

Penamaluru: 9 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీ పత్రాల అందజేత!

Penamaluru: పెనమలూరు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారి ఆదేశాల మేరకు, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు మొత్తం రూ.8,95,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) LOC పత్రాలను తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు.

ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చింది,ప్రజల అవసరాలను గుర్తించి,అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి,ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ,ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru