Pedana: పెనుమల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా విజయలక్ష్మి నామినేషన్ దాఖలు!
Pedana: కృష్ణాజిల్లా పెడన మండలం పెనుమల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చిల్లిముంత విజయలక్ష్మి శనివారం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Pedana: పెనుమల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా విజయలక్ష్మి నామినేషన్ దాఖలు!
Pedana: తొలిసారిగా పెడన మండలం పెనుమల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, గ్రామస్తులందరి ఆశీస్సులతో, సహకారంతో ముందుకు వెళ్తానని విజయలక్ష్మి తెలిపారు. గ్రామంలో మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
మొదటిసారి పోటీ చేస్తున్నప్పటికీ గ్రామంలో ఆమెకు మంచి ఆదరణ లభిస్తోంది. మహిళా అభ్యర్థిగా బరిలోకి దిగడంతో మహిళలు, యువత నుంచి ప్రత్యేక మద్దతు లభిస్తోందని గ్రామస్తులు అంటున్నారు.
నామినేషన్ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.




