Pedana: పెడన విశ్వభారతి హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!
Pedana: కృష్ణా జిల్లా పెడన విశ్వభారతి హైస్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంఈఓ సలోని విద్యార్థులకు బహుమతులు అందజేసి దిశానిర్దేశం చేశారు.
Pedana: పెడన విశ్వభారతి హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!
కృష్ణాజిల్లా, పెడన: స్థానిక విశ్వభారతి హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ముఖ్య అతిథులు జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా పెడన మండల విద్యాశాఖాధికారి సలోని మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు పట్టుదల,క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. మంచి లక్ష్యం పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు,శాస్త్రీయ నృత్యాలు,విచిత్ర వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో MEO వై.వి. హరినాథ్ విద్యావేత్త కె. లోకనాథం,ప్రిన్సిపాల్ అనుముకొండ గౌరీ ప్రసాద్, ఉపాధ్యాయులు అబ్దుల్ సుభాని,మౌలబి,వి.జె. పార్వతి,ఆర్.ధనలక్ష్మి పాల్గొన్నారు.




