Nandivada: 1000 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగింపు!

Nandivada: కృష్ణా జిల్లా నందివాడలో ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు. పుట్టగుంట వంతెన వద్ద పరిస్థితిని, ముంపు ప్రాంతాలను పరిశీలించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Sept 2026 12:58 PM IST
Nandivada
X

Nandivada: 1000 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగింపు!

Nandivada: కృష్ణాజిల్లా నందివాడలో బుడమేరు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో పుట్టగుంట వంతెన వద్ద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో కలిసి వరద పరిస్థితిని పరిశీలించారు.

వరద ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను తొలగించే చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దలింగాల, చిన్నలింగాల, చేదుర్తిపాడు, ఒద్దులమేరక గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. వేయి ఎకరాలు ముప్పునకు గురైనట్లు గుర్తించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్