Nandigama: నందిగామలో పట్టపగలే దారుణం జ్యువెలరీ షాప్ యజమానిపై కత్తితో దాడి!
Nandigama: నందిగామలో పట్టపగలే ఎంఎస్ జ్యువెలరీ షాప్ యజమాని శ్రీనివాసరావుపై ముసుగు ధరించిన మహిళ, పురుషుడు కత్తితో హత్యాయత్నం. ఆసుపత్రికి తరలింపు.
Nandigama: నందిగామలో పట్టపగలే దారుణం జ్యువెలరీ షాప్ యజమానిపై కత్తితో దాడి!
నందిగామ: పట్టణంలో ఎంఎస్ జ్యువలరీ షాప్ యజమాని మహంకాళి శ్రీనివాసరావు పై గుర్తు తెలియని ఒక మహిళతో సహా ఒక వ్యక్తి వచ్చి కత్తితో హత్యాయత్నానికి పాల్పడటం పట్టణంలో సంచలనంగా మారింది.
బంగారం కొనుగోలు చేయడానికి ఆడ మగ ఇద్దరు మాస్కు ధరించి షాపులోకి వచ్చి షాపు యజమానిని తాగటానికి మంచి నీళ్లు అడగగా మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్లిన యజమానిపై కత్తితో పలుచోట్ల దాడి చేయగా ఈ దాడిలో తీవ్ర గాయాలైన వ్యక్తి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావటంతో వారు అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు...
ఘటన స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు సిసి ఫుటేజ్ లో కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డ వారి సిసి ఫుటేజ్ నమోదయింది. బంగారం దొంగతనానికి వచ్చిన దొంగలే ఈ ఘటనకు పాల్పడినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. తీవ్ర గాయాలైన బంగారు షాపు యజమానిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు...




