Kanchikacherla: కంచికచర్లలో బీజేపీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు!

Kanchikacherla: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. బీజేపీ మండల అధ్యక్షుడు కాలవ మహేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.

Naresh, Nandigama
Published on: 17 Sept 2026 1:53 PM IST
Kanchikacherla
X

Kanchikacherla: కంచికచర్లలో బీజేపీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు!

Kanchikacherla: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు. విశ్వకర్మ జయంతి సందర్భంగా కంచికచర్ల మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కాలవ మహేష్ బాబు నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు కాలవ మహేష్ బాబు మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో సృష్టి కర్తగా విశ్వకర్మను పరిగణిస్తారు. అధర్వణ వేదంలో ఆహార ప్రదాతగా పేర్కొంటారు. పురుష సూక్తంలో విరాట పురుషుడిగా కీర్తి గడించాడు.

సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖుడిగా అన్ని వేదాల్లోనూ ప్రస్తావించిన వ్యక్తి విశ్వకర్మ. విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించామని ఈ సందర్భంగా విశ్వకర్మ జయంతి ప్రాముఖ్యతను అన్ని రకాల నిర్మాణ కార్మికులకు వివరించారు.

నిర్మాణ రంగంతో పాటు వివిధ వృత్తులకు విశ్వకర్మను ఆదిగురువుగా భావిస్తామని భారతదేశ మేడే ని విశ్వకర్మ జయంతి రోజున జరుపుకోవాలని మండల బీజేపీ అధ్యక్షులు కాలవ మహేష్ బాబు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కాలవ మహేష్ బాబు,మండల ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి నాగరాజు, జిల్లా ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ వడపల్లి విజయబాబు, జిల్లా మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ దేవరకొండ రమాదేవి, భారతీయ జనతా పార్టీ నాయకులు గుదె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Naresh, Nandigama

Naresh, Nandigama