Gannavaram: గన్నవరంలో టార్గెట్ వేధింపులు తాళలేక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్యాయత్నం!
Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో టార్గెట్ల ఒత్తిడి తాళలేక మేనేజర్ ఈశ్వర్ సోమవారం తన ఛాంబర్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
Gannavaram: గన్నవరంలో టార్గెట్ వేధింపులు తాళలేక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్యాయత్నం!
Gannavaram: బ్యాంకింగ్ రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న టార్గెట్ల ఒత్తిళ్లు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఖాతాలు తెరవడంతో పాటు బీమా లక్ష్యాలను పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు పెడుతున్న ఒత్తిళ్లను తట్టుకోలేక ఓ ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో సోమవారం చోటుచేసుకుంది.
గన్నవరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఈశ్వర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు తెరవడం, బీమా లక్ష్యాలను పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు తరచూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన సోమవారం మధ్యాహ్నం తన ఛాంబర్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో బ్యాంకు ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగులపై లక్ష్యాల పేరుతో పెరుగుతున్న ఒత్తిళ్లపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




