Guduru: గూడూరు మండలం రామన్నపేటలో కూటమి అభ్యర్థుల హోరెత్తిన ప్రచారం!
Guduru: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామన్నపేటలో కూటమి ఎంపీపీ అభ్యర్థి బొల్లా రాజేష్, ఇతర అభ్యర్థులతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Guduru: గూడూరు మండలం రామన్నపేటలో కూటమి అభ్యర్థుల హోరెత్తిన ప్రచారం!
Guduru: గూడూరు మండలం రామన్నపేట లో కూటమి ఎంపీపీ అభ్యర్థి బొల్లా రాజేష్ ఐదుగుళ్లపల్లి ఎంపీటీసీ అభ్యర్థి పృద్వి బాల శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోపి నాగబాబు మాట్లాడుతూ జడ్పిటిసి అభ్యర్థిగా చోడగం నాంచారమ్మ అలాగే ఎంపీటీసీ అభ్యర్థిగా పృథ్వి బాల శ్రీనివాసరావు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి తోట వేణు, చోడగం శ్రీనివాసరావు, పిఎసిఎస్ అధ్యక్షులు మూరాల ధనుష్,పోతుల రాము, ఎన్ ఏ బేగ్, గొరిపర్తి చంద్రశేఖర్, లుక్కా ఏలేష్,యాదవ రెడ్డి ఆంజనేయులు, మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.




