A.Konduru: 108 రకాల సేంద్రీయ పంటలను పరిశీలించిన చిన్న జీయర్ స్వామి!
A.Konduru: రేపూడిలో చిన్న జీయర్ స్వామి పర్యటన. 50 ఎకరాల్లో సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న 108 రకాల వంగడాల పరిశీలన. ప్రకృతి సేద్యం, పర్యావరణ పరిరక్షణకు పిలుపు.
A.Konduru: 108 రకాల సేంద్రీయ పంటలను పరిశీలించిన చిన్న జీయర్ స్వామి!
ఎ. కొండూరు: ఎ. కొండూరు మండలం, రేపూడి లో చిన్న జియర్ స్వామి పర్యటన, సుమారు 50 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండిస్తున్న 108 రకాల వంగడాలకు సంబందించిన పంటలను పరిశీలించిన జీయర్ స్వామి.
ప్రకృతి తో మమేకమై మానవుడు జీవించాల్సిన రోజులు ఆసన్నమయ్యాయన్న చిన్న జియర్ స్వామి. పంటలను పండించడమే కాక రైతులకు పంపిణీ చేసి ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించడమే లక్ష్యమని స్పష్టం.
తుఫాను లాంటి ప్రకృతి విపత్తులను ప్రయోగాత్మక పంటలు ఏ విధంగా ఎదుర్కుంటాయో కూడా పరిశీలన జరుగుతుందని వెల్లడి. వ్యవసాయ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు.




