Pedana: పెడన పల్లోటి స్కూల్‌లో ఘనంగా 77వ భారత రాజ్యాంగ సమర్పణ దినోత్సవం!

Pedana: కృష్ణా జిల్లా పెడన పల్లోటి పాఠశాలలో 77వ భారత రాజ్యాంగ సమర్పణ దినోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఫాదర్ బాలశౌరి, జాల యాకోబు పాల్గొన్నారు.

Reddy, Pedana
Published on: 26 Nov 2026 9:42 PM IST
Pedana
X

Pedana: పెడన పల్లోటి స్కూల్‌లో ఘనంగా 77వ భారత రాజ్యాంగ సమర్పణ దినోత్సవం!

కృష్ణాజిల్లా: పెడన స్థానిక పెడన పట్టణ లో గల పల్లోటి పాఠశాల యందు 77 వ భారత రాజ్యాంగ సమర్పణ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని పాఠశాల కరస్పాండెంట్ ఫాథర్ బాలశౌరి, ప్రిన్సిపల్ ఫాథర్ జాల యాకోబుతెలిపారు. ఈ మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంను రచించుటలో అంబేద్కర్ గారి కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షను పాఠశాల కరస్పాండెంట్ ఫాథర్ బాలశౌరీ చెబుతూ, నేడు బాలలైన మీరు భవిష్యత్ మేటి పౌరులుగా కీర్తించబడేలా అంబేద్కర్ ప్రణాళికాబద్దంగా రచించిన రాజ్యాంగాన్ని ఆశయసాధనలో ఆచరణాత్మక స్పూర్తితో నూతన ఒరవడిలో కొనసాగించాలని విద్యార్థినీ-విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Reddy, Pedana

Reddy, Pedana