Nandigama: 4 కోట్ల కరెన్సీ నోట్లతో రూపుదిద్దుకున్న అద్భుతమైన గణనాథుడు!

Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వాసవి మార్కెట్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూ.4 కోట్ల కరెన్సీ నోట్లతో ముస్తాబైన ప్రత్యేక వినాయక విగ్రహం.

Naresh, Nandigama
Published on: 21 Sept 2026 12:53 PM IST
Nandigama
X

Nandigama: 4 కోట్ల కరెన్సీ నోట్లతో రూపుదిద్దుకున్న అద్భుతమైన గణనాథుడు!

Nandigama: నందిగామ పట్టణంలో 44వ వార్షిక వాసవి మార్కెట్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవ మహోత్సవంగా నిర్వహిస్తున్నారు.

దశాబ్దాల నుంచి వాసవి మార్కెట్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతూవస్తున్నాయి.

విగ్నేశ్వరుడు విశేష పూజా కార్యక్రమాల తో పాటునవవిధ దివ్య హారతులతో నీరాజనాలు అందుకుంటున్నాడు.

అయితే ఈసారి ఏర్పాటు చేసిన వినాయకుడు విగ్రహం మండపం అందరిని అబ్బురపరుస్తుంది.

పదేళ్ల క్రితం 10 లక్షలతో ప్రారంభమైన ఈ కరెన్సీ వినాయకుడిని 4 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో ముస్తాబు చేసినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

Naresh, Nandigama

Naresh, Nandigama