Vijayawada: ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు!

Vijayawada: విజయవాడ ముత్యాలంపాడు షిర్డి సాయిబాబా మందిరంలో గౌరవాధ్యక్షులు పి. గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 29 Nov 2026 3:29 PM IST
Vijayawada
X

Vijayawada: ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు!

Vijayawada: ముత్యాలంపాడు శ్రీ షిర్డి సాయిబాబా మందిరం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఆదివారం, సోమవారం అదేవిధంగా పూర్ణిమ, ఏకాదశి పర్వదినాలలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు (ఆదివారం, 29-11-2026) సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి. గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులు పాల్గొని సత్యనారాయణ స్వామివారి వ్రతాలను ఆచరించారు.

వేద మంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాల మధ్య అత్యంత భక్తిపూర్వకంగా ఈ వేడుకలు జరిగాయి. కార్తీక మాసంలో సామూహికంగా నిర్వహించిన ఈ వ్రత కార్యక్రమంతో మందిర ప్రాంగణం భక్తులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులందరూ సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులు పొందారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.