Kunavaram: కూనవరంలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం!
Kunavaram: పోలవరం జిల్లా కూనవరంలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ ఆలూరి కోటేశ్వరరావు తెలిపారు.
Kunavaram: కూనవరంలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం!
Kunavaram: కూనవరంలోని భాస్కర టాకీస్ లో శనివారం స్థానిక సంస్థల ఎన్నికల పై వైఎస్ఆర్సిపి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కూనవరం మండల కన్వీనర్ ఆలూరి కోటేశ్వరరావు తెలిపారు.ఈ సమావేశానికి రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే,వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి హాజరుకానున్నట్లు తెలిపారు.కూనవరం మండలంలోని 16 పంచాయితీ లకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మధ్యాహ్నం నాలుగు గంటలకు సమీక్ష నిర్వహించనున్నట్లు అన్నారు.
కూనవరం మండలంలో గ్రామస్థాయి, మండల,జిల్లా,రాష్ట్రస్థాయిలో పార్టీ పదవులు పొందిన వారికి ID కార్డులు నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన వ్యూహ ప్రతివ్యూహాల పై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.కావున కూనవరం మండలంలోని ప్రతి వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని మండల కన్వీనర్ ఆలూరి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.




