Yellandu: ఇల్లందులో దొంగల ముఠా అరెస్ట్: ₹27 లక్షల సొత్తు స్వాధీనం

Yellandu: ఇల్లందు పట్టణంలో 10 చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, ₹27 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.

SHOBAN BABU, YELLANDU
Published on: 7 Nov 2026 5:23 PM IST
Yellandu
X

Yellandu: ఇల్లందులో దొంగల ముఠా అరెస్ట్: ₹27 లక్షల సొత్తు స్వాధీనం

ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు లో గత కొద్ది రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు,వారి వద్ద నుంచి 27 లక్షల విలువైన బంగారం, వెండి,మూడు సెల్ ఫోన్లు, ఒక లాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.శనివారం ఇల్లందు పోలీస్ స్టేషన్లో చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఇల్లందు పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను ఇల్లందు పోలీసులు వల పని పట్టుకున్నారని తెలిపారు. వరుస చోరీలకు పాల్పడుతున్న ఇల్లందు పట్టణానికి చెందిన లోద్ విశాల్ కుమార్ (14 నెంబర్ బస్తి ),గౌతమ్ లొద్ (15 నెంబర్ బస్తీ) కోరి కళ్యాణ్ (15 నెంబర్ బస్తీ) అను ముగ్గురు నిందితులను వలపన్ని పట్టుకున్నట్లు తెలిపారు.

వారి వద్ద నుంచి 165 గ్రాముల బంగారం,రెండు కిలోల వెండి,ఒక లాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వాటి విలువ సుమారు 27 లక్షలు ఉంటుందని ఎస్పి వివరించారు. నిందితులను ఈరోజు న్యాయస్థానంలో హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని వివరించారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పి రోహిత్ రాజు ప్రజలకు సూచించారు.

పట్టుబడిన ముగ్గురు నిందితులు జెకె కాలనీ,సుభాష్ నగర్, ఆజాద్ నగర్, వెంగళరావు నగర్ కాలనీ, తదితర ప్రాంతాల్లో 10 దొంగతనం కేసులకు పాల్పడినట్టు ఎస్పీ వివరించారు. దొంగలను పట్టుకున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ రవిని ఎస్పీ అభినందించారు. కానిస్టేబుల్ రవి ని నగదు రివర్డ్ తో సత్కరించారు.ఈ మీడియా సమావేశంలో ఇల్లందు డిఎస్పి వెంకన్న బాబు, సిఐ తాటిపాముల సురేష్, ఎస్సై ఉమా, సారంగపాణి తదితరులు ఉన్నారు.

SHOBAN BABU, YELLANDU

SHOBAN BABU, YELLANDU