Yellandu: ఇల్లందు పోచారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Yellandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోచారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం. పాల్గొన్న CPI(ML) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు నాయిని రాజు, ఇతర నేతలు.

SHOBAN BABU, YELLANDU
Published on: 4 Nov 2026 1:30 PM IST
Yellandu
X

Yellandu: అమరుల త్యాగం వృధా కాదని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ రాష్ట్ర నాయకులు నాయిని రాజు, అజ్మీరా బిచ్చ, బుర్ర రాఘవులు అన్నారు. బుధవారం ఇల్లందు మండలం పోచారం గ్రామంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఎర్రజండాలతో ప్రదర్శన నిర్వహించి, అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేశారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు వందేళ్ళ ఉద్యమంలో దేశం కోసం, పిడిత ప్రజల విముక్తి కోసం, భూమి,భుక్తి ఎందరో అమరవీరులు త్యాగాలు చేశారని తెలిపారు. ప్రజా పోరాటాల ముఖ్యమని తమ ప్రాణాలను పణంగా పెట్టిన రావన్న, ఎల్లన్న, దొరన్న, కోటన్న, బాటన్న, లింగన్న,చంద్రశేఖర్ అన్న, గండి యాదన్న, కాచినపల్లి అమరవీరులు,ఈసం పాపన్న, ఏనుగుల వెంకన్న, కాంపాటి చంద్రన్న, చుంచు వెంకన్న, ఈసం భద్రన్న, సూర్నపాక రామూర్తి వీరితోపాటు మన గ్రామంలో భీంజీ, హరి అన్న బొల్లం మల్లక్క, రాసాల సీతారాములు ఎంతోమంది అమరవీరుల పోరాటలతో సాధించిన హక్కులు, ఆస్తిని నేడు అనుభవిస్తా ఉన్నాం అన్న విషయాన్ని కొందరు మరిచిపోయారని గుర్తు చేశారు.

కాని నేడు పెత్తందారులు కొందరు ఎర్రజెండాను అవహేళన చేస్తూ ఉన్నారని, గ్రామాల్లో ఎర్ర జెండా ఉంటే వారి పబ్బం గడవదని కుటీలమైన ఎత్తుగడలతో ప్రజల మధ్య చిచ్చులు పెట్టి ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్నారు. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరవీరులు చూపిన బాటలో పయనించాలని పేదల హక్కులను కాపాడుట కోసం సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పందా నిర్వహిస్తున్న పోరాటంలో ప్రజలు కదం తొక్కాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బుర్ర లక్ష్మయ్య, చందావత్ బాలు, కోడి కృష్ణ, అజ్మీర ప్రభాకర్, వాంకుడోత్ లింగన్న,అజ్మీర సక్రం, బొల్లం మహేందర్, బొల్లం రాము, జరపలా బాబురావు,చందావత్ లక్ష్మణ్, అజ్మీర లింగ, సపవట్ ప్రేమ్ కుమార్, బుర్ర రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.

SHOBAN BABU, YELLANDU

SHOBAN BABU, YELLANDU