Kukunoor: చిన్న బుర్రతోగులో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం!

Kukunoor: ఏలూరు: వేలేరుపాడు చిన్న బుర్రతోగులో యక్షి ఆదివాసీ మహిళా సంఘం ప్రపంచ ఆహార దినోత్సవం జరిపింది. సంప్రదాయ వ్యవసాయం, భూ, నీటి పరిరక్షణకు తీర్మానించారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 17 Oct 2026 11:12 AM IST
Kukunoor
X

Kukunoor: చిన్న బుర్రతోగులో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం!

Kukunoor: మండల పరిధిలోని చిన్న బుర్రతోగు గ్రామంలో యక్షి సంస్థ ఆదివాసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మడకం సునీత అధ్యక్షతన ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. గత ఐదు రోజులుగా పరిసర గ్రామాల్లో ప్రచారం నిర్వహించి, వ్యవసాయంలో వచ్చిన మార్పులపై పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. సంఘ సభ్యురాలు కాకా రజిని మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, యంత్రాల వినియోగంతో వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయని, సంప్రదాయ విత్తనాలు, పశుసంపద తగ్గిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

భూమి, నీరు, విత్తనాలు, పశుసంపదను సంరక్షించుకోవాలని గ్రామస్తులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR