Kothagudem: ఆయిల్ పామ్ తోటల్లో పుట్టగొడుగుల సందడి!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుర్రాలచెరువులోని ఆయిల్ పామ్ తోటల్లో విరివిగా లభిస్తున్న సహజ పుట్టగొడుగులు. ఎంతో ఉత్సాహంగా ఏరుకుంటున్న స్థానిక రైతులు, గ్రామస్తులు.
Kothagudem: ఆయిల్ పామ్ తోటల్లో పుట్టగొడుగుల సందడి!
Kothagudem: అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువులో ఇటీవల కురిసిన వర్షాలకు ఆయిల్ ఫామ్ తోటల్లో పుట్టగొడుగులు (పుట్టకొక్కులు) విరివిగా మొలిచాయి. వీటిని మష్రూమ్స్ అంటారుకూడ తడిసిన నేల, కుళ్లిన ఆయిల్ ఫామ్ ఆకులు, మట్టిలో ఉన్న సేంద్రీయ పదార్థం కలిసి ఈ పుట్టకొక్కులు గుంపులు గుంపులుగా వచ్చాయి.
తోట కచేలు (కంప మధ్య) తెల్లగా మెరుస్తున్న ఈ సహజ మష్రూమ్స్ ను స్థానిక రైతులు, కూలీలు ఎంతో ఉత్సాహంగా ఏరుకుంటున్నారు. గుర్రాలచెరువు గ్రామానికి చెందిన రైతు సంకురాత్రి సతీష్ తోటలో మొలిచాయి.
ఒకప్పుడు అడవుల్లో, పొలం గట్లపై, కంచెలో వున్నా పుట్టమీద అధిక వర్షాలు కూరసినప్పుడు మాత్రమే కనిపించే ఈ పుట్టకొక్కులు ఇప్పుడు ఆయిల్ ఫామ్ తోటల్లో కూడా సమృద్ధిగా లభిస్తుండటం విశేషం. సహజంగా పెరిగే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రుచితో పాటు పోషకాలు ఎక్కువగా ఉండటంతో గ్రామస్తులు వీటిని ఇష్టంగా వండుకుంటారు.




