Julurupad: కూలీలు ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈఓ
Julurupad: గ్రామాల్లో వ్యవసాయ పనులు లేనందున కూలీలు ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రూ. 308 వేతనం దక్కేలా చూడాలని జడ్పీ సీఈఓ నాగలక్ష్మి తెలిపారు.
Julurupad: కూలీలు ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈఓ
Julurpad: గ్రామాలలో వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు వీ బి జి రాంజీ పనులకు హాజరై పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్పీసీఈఓ నాగలక్ష్మి తెలిపారు. శనివారం జూలూరుపాడులో ఉన్నత పాఠశాలలో రెండో రోజు మేట్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ సూపర్ ఎల్ ని నో ప్రభావంతో రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు,సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమర్థవంతంగా పనిచేస్తే నష్టాన్ని నివారించే విధంగా కృషి చేయాలని అన్నారు.
భూగర్భ జలాలు అడుగంటి పోవటంతో రానున్న రోజుల్లో తాగునీరు దొరకటం ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, రైతులు పొలాలలో నీటి కుంటల నిర్మాణాలను చేపట్టాలని కోరారు. సెక్షన్ లో నేర్చుకున్న అంశాలను మేట్లు క్షేత్రస్థాయిలో అమలు చేసి పనులను పారదర్శకంగా చేపట్టే విధంగా కృషి చేయాలని అన్నారు.
ఎలాంటి అవకతవకలు జరగకుండా నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని, కూలీలకు రోజువారి వేతనం రూ 308లు పడే విధంగా కొలతలు ఇచ్చి పనులు చేయించాలని మేట్లకు సూచించారు. పనులకు అధిక సంఖ్యలో రప్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం పీ ఓ తులసీరామ్, ఏ పీ ఓ రామారావు తదితరులు పాల్గొన్నారు.




