Khammam: విద్యానగర్ అభివృద్ధికి కృషి.. కమిషనర్‌కు సొసైటీ కృతజ్ఞతలు!

Khammam: ఖమ్మం విద్యానగర్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులపై మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వెల్ఫేర్ సొసైటీ కృతజ్ఞతలు తెలిపి అభినందన పత్రం అందజేసింది.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 23 Nov 2026 1:04 PM IST
Khammam
X

Khammam: విద్యానగర్ అభివృద్ధికి కృషి.. కమిషనర్‌కు సొసైటీ కృతజ్ఞతలు!

Khammam: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 1వ మరియు 4వ డివిజన్లలో ఉన్న విద్యానగర్ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపి, కాలనీ రూపురేఖలు మారేలా కృషి చేస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య, ఐఏఎస్ గారిని విద్యానగర్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు సోమవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, కమిషనర్‌కు అభినందన పత్రాన్ని అందజేశారు.

విద్యానగర్ కాలనీ 2012 నుంచి అభివృద్ధి చెందుతున్నప్పటికీ, గతంలో చాలా కాలంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కొరతతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సొసైటీ ప్రతినిధులు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం 2025 ఆగస్టులో విద్యానగర్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసి, కాలనీ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

తమ సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించి, హామీ ఇవ్వడమే కాకుండా కేవలం 14 నెలల వ్యవధిలోనే అభివృద్ధి పనులను వేగవంతం చేసి ఆచరణలో చూపించారని ప్రశంసించారు.

కాలనీలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలు:

4వ డివిజన్: మొత్తం 8 రోడ్లకు గాను 8 రోడ్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించారు.

1వ డివిజన్: మొత్తం 28 రోడ్లకు గాను 14 రోడ్ల పనులు పూర్తయ్యాయి. మరో 3 రోడ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

రోడ్లు, డ్రైనేజీ సదుపాయాల కల్పనతో పాటు ప్రజల్లో నమ్మకం, ఆత్మగౌరవం, భరోసా కల్పించేలా ప్రజలకు అందుబాటులో ఉంటూ స్పందిస్తున్న కమిషనర్ పనితీరు అభినందనీయమని సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు.

అధికారులు బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లినా, ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన సానుకూల మార్పులు చిరస్థాయిగా నిలిచిపోతాయని తమ అభినందన పత్రంలో పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత బాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో విద్యానగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు బండి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి మోతె వెంకన్నతో పాటు సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.