Karakagudem: వెంకటాపురంలో ఏడాదిగా మూతపడిన పోస్టాఫీస్.. ప్రజల ఇబ్బందులు

Karakagudem: భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం వెంకటాపురంలో ఏడాదిగా పోస్టాఫీస్ మూతపడటంతో పింఛన్లు, సుకన్య పథకం లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని సర్పంచ్ కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 13 Nov 2026 4:28 PM IST
Karakagudem
X

Karakagudem: వెంకటాపురంలో ఏడాదిగా మూతపడిన పోస్టాఫీస్.. ప్రజల ఇబ్బందులు

కరకగూడెం: మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ పంచాయతీలో గత ఏడాది కాలంగా పోస్టాఫీస్ సేవలు నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు పోస్టల్ అధికారులు ఉన్నారా? లేదా? అధికారుల నిర్లక్ష్యమా? అంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నెలవారీ పింఛన్ డబ్బులు తీసుకునేందుకు వృద్ధులు, లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని స్థానిక సర్పంచ్ కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదేవిధంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో నెలవారీగా డబ్బులు జమ చేయాలనుకునే తల్లిదండ్రులు కూడా పోస్టాఫీస్ సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోని పోస్టాఫీస్ గదికి తాళం వేసి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు తెరుచుకోకపోవడం లేదని అధికారుల పనితీరుపై పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇప్పటికైనా సంబంధిత పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి వెంకటాపురం గ్రామంలో పోస్టాఫీస్ సేవలను పునరుద్ధరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానిక సర్పంచ్ కేశవరావు, ఉన్నత అధికారులు కోరుతున్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA