Bhadrachalam: చర్ల మండలంలో కూల్‌డ్రింక్ వ్యాపారులపై సరఫరాదారుల ఒత్తిడి!
Bhadrachalam: చర్ల మండలం సత్యనారాయణపురం, ఆర్ కొత్తగూడెంలో కూల్‌డ్రింక్ వ్యాపారులపై కోకా-కోలా సరఫరాదారుల ఒత్తిడి. గడువు ముగియనున్న స్టాక్ ఇస్తున్నారని ఆందోళన.
Bhadrachalam: చర్ల మండలంలో కూల్‌డ్రింక్ వ్యాపారులపై సరఫరాదారుల ఒత్తిడి!
Bhadrachalam: భద్రాచలం చర్ల మండలం సత్యనారాయణపురం, ఆర్ కొత్తగూడెం గ్రామాల్లో పలువురు కూల్‌డ్రింక్ దుకాణదారులపై కోకా-కోలా సరఫరాదారులు ఒత్తిడి తెస్తున్నారంటూ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. తమకు సరఫరా చేస్తున్న కూల్‌డ్రింక్ బాటిళ్లలో కేవలం పది రోజుల్లోపు గడువు ముగిసే ఉత్పత్తులు ఉంటున్నాయని, వాటిని విక్రయించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు.
గడువు సమీపంలో ఉన్న బాటిళ్లను తీసుకోవడం వల్ల అవి అమ్ముడుపోకపోతే తమకే ఆర్థిక నష్టం వాటిల్లుతుందని దుకాణదారులు సరఫరాదారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అయితే అమ్మాల్సిందే లేదంటే సప్లై నిలిపివేస్తాం” అంటూ ఒత్తిడి చేస్తున్నారని పలువురు వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
వ్యాపారులపై ఇలా ఒత్తిడి చేయడం వల్ల ఒకవైపు తమకు నష్టం కలుగుతుండగా, మరోవైపు వినియోగదారులకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గడువు తేదీకి అతి దగ్గరగా ఉన్న ఉత్పత్తులను దుకాణాలకు సరఫరా చేయడంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
అమ్ముడుపోని సరుకుకు నష్టం ఎవరు భరిస్తారు..? గడువు ముగిసేలోపు మొత్తం సరుకు అమ్మడం సాధ్యం కాకపోతే మా పరిస్థితి ఏమిటి..? అంటూ దుకాణదారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంపై కోకా-కోలా యాజమాన్యం సంబంధిత డిస్ట్రిబ్యూటర్ స్పందించి స్పష్టత ఇవ్వాలని వ్యాపారులు కోరుతున్నారు. గడువు తేదీకి దగ్గరగా ఉన్న ఉత్పత్తుల సరఫరాపై సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.




