Bhadrachalam: భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు తేదీలు ఖరారు!

Bhadrachalam: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల తేదీలను ఈవో దామోదర్ రావు ఖరారు చేశారు. డిసెంబర్ 20న ఉత్తర ద్వార దర్శనం ఉండనుంది.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 29 Nov 2026 1:28 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు తేదీలు ఖరారు!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు 2026 డిసెంబర్ 10వ తేదీ నుంచి 2026 డిసెంబర్ 30వ తేదీ వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కె. దామోదర్ రావు వెల్లడించారు.

డిసెంబర్ 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పగల్ పత్తు ఉత్సవాలు డిసెంబర్ 19వ తేదీన అత్యంత వైభవంగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఇక డిసెంబర్ 20వ తేదీన స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ పవిత్రమైన ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాది మంది భక్తులు భద్రాచలం తరలివచ్చే అవకాశం ఉంది.

డిసెంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహించనుండగా డిసెంబర్ 31వ తేదీ నుంచి 2027 జనవరి 2వ తేదీ వరకు విలాసోత్సవాలు జరగనున్నాయి. అనంతరం జనవరి 4వ తేదీన విశ్వరూప సేవతో ఉత్సవ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం రామయ్య సన్నిధిలో జరిగే ఈ మహోత్సవాలను కనులారా వీక్షించేందుకు భక్తులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు... భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో కే దామోదర్ రావు తెలియజేశారు

దక్షిణ అయోధ్యలో వైకుంఠ ఏకాదశి వైభవం. ఉత్తర ద్వార దర్శనంతో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem