Khammam: ఖమ్మంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనకు ఏర్పాట్లు!
Khammam: ఖమ్మం అల్లిపురం కొత్తగూడెంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనకు ముమ్మర ఏర్పాట్లు. ఈ నెల 12న త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా భూమిపూజ.
Khammam: ఖమ్మంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనకు ఏర్పాట్లు!
Khammam: ఖమ్మం నగరంలోని అల్లిపురం కొత్తగూడెం ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ హైవే ని ఆనుకొని టిటిడి ఆధ్వర్యంలో నిర్మాణం కాబోతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం శంకుస్థాపన కార్యక్రమం కు అన్ని రకాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో 22 ఎకరాల ప్రాంతంలో 100 కోట్ల నిధులతో అత్యంత వైభవంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.. ఈనెల 12వ తేదీన ఉదయం 11 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర ఏంటి స్వామివారి భక్తుల ఆధ్వర్యంలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరావు తనయుడు యుగంధర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుపాకుల యలగొండ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శంకుస్థాపన ఏర్పాటులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 50 వేల నుంచి లక్ష మంది వరకు పాల్గొని ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా పార్కింగ్ సౌకర్యం జిల్లా వ్యాప్తంగా ప్రజలకు పిలుపు అందించేందుకు కాంగ్రెస్ స్టేన్లు విస్తృత ప్రచారం చేస్తున్నారు.




